మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం, విజయవాడ


మన ఆరోగ్యాలయం కృష్ణా నది తీరాన ప్రశాంత వాతావరణం లో 18 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరి వుంది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి స్వీయ పర్యవేక్షణలో ప్రతి నిత్యం ఆరోగ్య మహా యజ్ఞం జరుగుచున్నది. నెల నెలా కొన్ని వందల మంది ఆరోగ్యాభిలాషులు ఇక్కడికి విచ్చేసి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే జీవన విధానాన్ని నేర్చుకుంటున్నారు.వివరాలు...

ప్రకృతి విధాన పరిచయం


ఆరోగ్యాన్ని అందించే మంచి అలవాట్లు ఏవో వాటిని నేర్పించి అనారోగ్య కారణమైన చెడ్డ అలవాట్లను తెలియజేసి ఎవరి ఆరోగ్యాన్ని వారి చేతుల్లో ఎవరి ఇంట్లో వారే బాగుచేసుకొనేటట్లు చేసే జీవన విధానo, మంచి అలవాట్లతో జీవించే విధానమే ప్రకృతి జీవన విధానంవివరణ...

సంస్కార్ ప్రకృతి ఆశ్రమం, అక్బర్ నగర్ నిజామాబాద్


పచ్చని చెట్ల నీడలో, సహజ సిద్ధమైనా కొండ ప్రక్కన, ఏ విధమైన కాలుష్యం లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో, 100 పడకల సామర్థ్యంతో సుశిక్షుతులైన సిబ్బందితో ఆరోగ్యాభిలాషులకు సేవలు అందించడానికి సంస్కార్ ఆశ్రమం 2006 సం|| నుంచి కొలువు తీరి ఉంది.వివరాలు...

మంతెన సత్యనారాయణ రాజు గారి రచనలు/ప్రసంగాలు


డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు సుమారుగా గత రెండు దశాబ్దాలుగా ప్రకృతి జీవన విధానాన్ని ఆచరిస్తున్నారు. ఈ ప్రయాణంలో తను తెలుసుకున్న ప్రకృతి జీవన రహస్యాలను సమాజంలో అందరికి ఉపయోగపడాలని, తన అనుభవాన్నంత రంగరించి అందరికి అర్థమయ్యే శులభ శైలిలో ప్రకృతి జీవన రహస్యాలను పుస్తకాల రూపంలో ప్రసంగాల రూపం లో అతి తక్కువ ధరలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందిస్తున్నారు.వివరాలు...
జరగబోయే కార్యక్రమాలు

ఆరోగ్యాలయం లో హెల్త్ క్యాంపులు

మే 1 నుంచి - మే 30 వరకు అధికబరువు / షుగరు క్యాంపు
మే 1 నుంచి - మే 15 వరకు శరీర శుద్ధి క్యాంపు
మే 16 నుంచి - జూన్ 15 వరకు అధికబరువు / షుగరు క్యాంపు
మే 16 నుంచి - మే 30 వరకు శరీర శుద్ధి క్యాంపు
మంచి మాట

ఆలోచన మంచిదైతే ఆచరణ మంచిదవుతుంది
మనసు నిర్మలమైతే ఆరోగ్యం నీ సొంతమవుతుంది
భోగాలకు బానిసైతే మానవుడొక రోగి
సాధనకు అంకితమైతే ఈ మానవుడే ఒక యోగి